గిట్టుబాటు ధర కోసం ప్రాసెసింగ్ క్లస్టర్ల ఏర్పాటు
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
మేడ్చల్, మే 25 : రైతులకు కిట్టుబాటు ధరలు కల్పించేందుకే ప్రాసెసింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మేడ్చల్ మండలం పూడూరులోని రైతు సేవా సహకార సంఘంలో సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి పథకం(ఎస్‌ఎఫ్‌యూఆర్‌టీఐ) కింద సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా మంత్రిత్వ శాఖ (ఎన్‌ఐ ఆర్థిక సహకారంతో నిర్మిస్తున్న కూరగాయలు, పండ్ల ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మార్కెట్ల నుంచి ప్రతి ఏటా సుమారు 190 టన్నుల కూరగాయలు, పండ్లు వ్యర్థమవుతున్నాయని, ఈ వ్యర్థాలను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కృషి చేస్తామన్నారు.
ధరలు పడిపోయిన సమయంలో పండ్లు, కూరగాయలను కట్ చేసి కట్ ప్యాకింగ్ చేయడం ద్వారా సాసులు, ప్యూరీ ఫౌడర్, చట్నీలు చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందన్నారు.






