డైల్ 100 ఫిర్యాదులపై నిర్లక్ష్యానికి చర్యలు
27-11-2024 11:22 PM
ఎస్పీ నారాయణరెడ్డి..
వికారాబాద్ రూరల్ (విజయక్రాంతి): డైల్ 100 ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి హెచ్చరించారు. కేసులు వెంటనే పరిష్కరించి ప్రజల సమస్యలను విని మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. జిల్లాలో సీసీటీవీలా ఏర్పాటులో అవగాహన కల్పించి నిర్వహణపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.






