28-11-2025 09:13:33 AM
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో(Banjara Hills) డైమండ్ నెక్లెస్ చోరీ అయింది. ప్రముఖ వ్యాపారి ఇంట్లో రూ. 25 లక్షలు విలువైన నెక్లెస్(Diamond necklace stolen) చోరీకి గురైంది. ముగ్గురు మహిళలు కొనడానికి వచ్చినట్లు నటించి నెక్లెస్ కొట్టేశారని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.