28-11-2025 08:33:59 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం పలు కీలక అంశాలపై సమీక్షలు నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జీహెచ్ఎంసీ అంశంపై సీఎం అధికారులతో సమీక్షించనున్నారు. 6.30 గంటలకు బెంగళూరు-హైదరాబాద్ కొత్త నేషనల్ హైవేపై(Bangalore-Hyderabad new national highway) చర్చించనున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ రెడ్డి సమీక్షలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.