28-11-2025 09:03:43 AM
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Charitable Trust) స్వచ్ఛంద సంస్థకు విదేశీ విరాళాల అవకాశం కల్పించింది. విదేశీ వివరాలు స్వీకరించే వీలు ట్రస్టుకు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు కింద బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నడుపుతున్నారు. విదేశీ విరాళాలకు ఎఫ్ సీఆర్ఏ అనుమతి తీసుకోవాలని ఇటీవల నిబంధనల్లో మార్పులు చేశారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 కింద నమోదు చేసుకోవాలని నిబంధన ఉంది. నిబంధనల మార్పుతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు కేంద్రం అనుమతి కోరింది. ట్రస్టు విజ్ఞప్తికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమోద ముద్ర వేసినట్లు సమచారం.