calender_icon.png 28 November, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఈగల్.. ఢిల్లీలో భారీ ఆపరేషన్

28-11-2025 08:47:02 AM

  1. డ్రగ్స్ లింకులపై ఈగల్ ప్రత్యేక నిఘా
  2. భారీగా డబ్బు, డ్రగ్స్ స్వాధీనం
  3. 50 మంది నిందితులు అరెస్ట్ చేసిన ఈగల్ టీమ్
  4. నైజీరియన్ డ్రగ్ నెట్ వర్క్ ను చేధించిన ఈగల్
  5. 16 బృందాలతో అంతరాష్ట్ర ఆపరేషన్

న్యూఢిల్లీ: తెలంగాణ ఈగల్ టీమ్(Telangana Eagle Team) దేశరాజధాని ఢిల్లీలో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈగల్ పోలీసులు 16 బృందాలతో అంతరాష్ట్ర ఆపరేషన్ చేపట్టాయి. దేశవ్యాప్తంగా ఉన్న భారీ నైజీరియన్ డ్రగ్ నెట్ వర్క్ ను ఈగల్ చేధించింది. 50 మంది నిందితులను తెలంగాణ ఈగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈగల్ బృందం నిందితుల నుంచి భారీగా డ్రగ్స్, డబ్బు స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ-హైదరాబాద్ డ్రగ్స్ లింకులపై(Delhi-Hyderabad Drugs Links) ఈగల్ బృందం ప్రత్యేక నిఘా పెట్టింది. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తెలంగాణ ఈగల్ బృందం దాడులు నిర్వహించింది. వీసా గడువు ముగిసిన నైజీరియన్లను ఈగల్ అరెస్ట్ చేసింది. నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నంలో తెలంగాణ ఈగల్ బృందం దాడులు చేసింది.