28-11-2025 08:09:50 AM
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో(Anantapur district) ఘోర విషాదం చోటుచేసుకుంది. తల్లి, కుమారుడు అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మృతులను రామగిరి డిప్యూటీ తహశీల్దార్(Ramagiri Deputy Tahsildar) భార్య, కొడుకుగా గుర్తించారు. మూడేళ్ల కుమారుడిని గొంతుకోసి చంపిన తల్లి అమూల్య అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. కుటుంబకలహాలతో కుమారుడిని చంపి తల్లి ప్రాణాలు తీసుకుందని పోలీసులు భావిస్తున్నారు. రెండ్రోజుల క్రితం అమూల్య దంపతులు గొడవపడ్డారని స్థానికులు తెలిపారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం అమూల్య భర్త రవిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు..