calender_icon.png 21 December, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వజ్రాలతో ఏడు వారాల నగలు ఆవిష్కరించిన డైమండ్ స్టోర్

21-12-2025 12:48:24 AM

హైదరాబాద్‌కు చెందిన చందుభాయ్ ది డైమండ్ స్టోర్, ప్రాచీన భారతీయ రాజ సంప్రదాయాల నుండి ప్రేరణ పొందిన ఒక అద్భుతమైన ఆభరణాల సృష్టిని ఆవిష్కరించింది. చారిత్రాత్మక ఏడు వారాల నగలకు ఆధునిక రూపంతో వజ్రాలతో సరికొత్తగా రూపొందించింది. ఈ ఏడు భాగాల వజ్రాలు , నవరత్నాల కళాఖండాన్ని 22,000 సహజ వజ్రాలు మరియు అసలైన నవరత్న రాళ్లతో తయారు చేశారు. ఇది వివాహ వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలిచి, డిజైన్ వర్గాలలో ప్రశంసలను అందుకుంది.

శతాబ్దాల నాటి ‘ఏడువారాల నగలు’సంప్రదాయాన్ని ఈ అసాధారణ ఆభరణం తిరిగి ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఒక వారంలోని ఏడు రోజుల్లో ఒక్కోరోజు ఒక్కో ఆభరణాన్ని రాజకుటుంబాలకు చెందిన మహిళలు ధరించేవారు. దీనిని స్ఫూర్తిగా తీసుకునే వజ్రాలతో సరికొత్తగా తమ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ ఏడు భాగాలను విడివిడిగా ఆభరణాలుగా ధరించడంతో పాటు అన్నింటినీ కలిపి ఒక ప్రతిష్ఠాత్మక ఆభరణంగా కూడా వేసుకోవ‌చ్చ‌ని డిజైనర్స్ వెల్లడించారు.

సంప్రదాయం, ఆధ్యాత్మికత, సమకాలీన శిల్పకళ ఈ డిజైనింగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏనుగులు, సింహాలు, హంసలు, వృక్షవల్లులు, పుష్పాల అలంకారాలు బలం, ధైర్యం, పరిశుద్ధత, అభివృద్ధి, సంతానసంపత్తి, పరిణామాన్ని సూచిస్తాయి. ఆలయ శిల్పకళ, సూక్ష్మ చిత్రకళ, భారతీయ రాచ‌రిక ఆభరణాల వైభవాన్ని తలపించేలా ఈ ఆభరణంలోని సూక్ష్మ నైపుణ్యం అందరి ప్రశంసలు అందుకుంది. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న జ్యోతిష్య క్రమానుసారం మాణిక్యం, ముత్యం, ప‌గ‌డం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, గోమేధికం, వైడూర్యం ఈ తొమ్మిది రత్నాలను అమర్చారు.