గంగుల నుంచి 5 కోట్లు తీసుకోలేదా?

02-05-2024 02:00:35 AM

పొన్నం ప్రభాకర్ అవినీతిపరుడు

ఎన్టీపీసీ బూడిద స్కాంపై విచారణ చేపట్టాలి 

బీజేపీ నేత రాణిరుద్రమ సంచలన వ్యాఖ్యలు


కరీంనగర్ సిటీ, మే 1(విజయక్రాంతి): రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్ద అవినీతిపరుడని, బెదిరింపులకు పాల్పడుతున్నడని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమదేవి, సోలంకి శ్రీనివాస్‌ల తో కలిసి  మీడియా సమావేశంలో మంత్రి ప్రభాకర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఘోర ఓటమి తథ్యమని తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కాలుగాలిన పిల్లిలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

బండి సంజయ్ చేసిన అభివృద్ధి, పోరాటాలను చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓ ట్రావెల్స్ అధినేత నుండి రూ.కోటిన్నర విలువైన కారును పొన్నం తీసుకు న్నది నిజం కాదా? ఎన్టీపీసీ బూడిద నుం డి లంచాలు తీసుకోలేదా అని ప్రశ్నించారు. అలాగే బూడిద తీసుకెళ్లే లారీలను ఆపేసి కాంట్రాక్టర్‌ను బెదిరించి తొలుత రూ.2 కోట్లు వసూలు చేసిన మాట వాస్త వం కాదా? ఆ డబ్బులు సరిపోలేదని మరో రూ.6 కోట్లు వసూలు చేసింది నిజం కాదా? అని నిలదీశారు. ఆయన తో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు కాంట్రాక్టర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేసినా మాట నిజం కాదా? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ అం టేనే స్కాములని, 2జీ, సహారా, బొగ్గు, ఈఎస్‌ఐ కుంభకోణాలతో దేశాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. 

గత ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని కొంతమంది కాంగ్రెస్ నేతల వద్ద డబ్బులు వసూలు చేసినా సరిపోవని ఎక్కడపడితే అక్కడ అవినీతి అక్రమాలకు పొన్నం దిగారని అన్నారు. అలాగే ఎమ్మెస్సార్ మనవడు రోహిత్‌రావుకు టికెట్ ఇప్పిస్తానంటూ రూ.10 కోట్లదాకా ఖర్చు పెట్టించింది కాంగ్రెస్ నాయకులకు తెలుసునని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చినందుకు వెలిచాల రాజేందర్ వద్ద రూ.కోట్లాది రూపాయలు డబ్బులు వసూలు చేశారని, గ్రానైట్ లీజు పేరుతో క్వారీ యజమానులకు లాభం రాకుండా కుటుంబ సభ్యులకు దోచి పెట్టింది వాస్త వం కాదా అని ఆరోపించారు. మంత్రి పొన్నం అవినీతి ఆరోపణలు, వ్యవహారశైలిని చూసి కాంగ్రెస్ నేతలే అసహ్యిం చుకుంటున్నారని చెప్పారు. చివరకు నాటి మంత్రి, ఎమ్మెల్యే గంగులతో లాలూచీ పడ్డారని తెలిపారు.

గంగుల వద్ద రూ. 5 కోట్లు తీసుకుని హుస్నాబాద్‌కు పారిపోయిన సంగతి ప్రజలకు తెలు సునని వివరించారు. ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా ఉంటూ ఎవరు అధికారం లో ఉంటే వాళ్లకు సాగిలపడి డబ్బులు దండుకుని విద్యార్థి ఉద్యమాలను నీరుగార్చిన చరిత్ర పొన్నం ప్రభాకర్‌దేనని గుర్తుచేశారు. పొన్నం తన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీని కూడా తాకట్టు పెట్టే ఘనుడని ధ్వజమెత్తారు. బూడిద స్కాం పై సమగ్ర విచారణ జరపాలని, అవసరమైతే సీబీఐకి లేఖ రాస్తామని రుద్రమ పేర్కొన్నారు. బీజేపీ బంపర్ మెజారిటీతో అత్యధిక సీట్లు గెల్చుకోవడం తథ్యమని అన్ని సర్వేలు తేల్చడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు పిచ్చిపట్టినట్లుగా మాట్లాడు తున్నారని ఆరోపించారు. 54 ఏళ్లు దేశా న్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్యాంకు మెట్లు ఎక్కని 4 కోట్ల మంది పేదలకు జీరో బ్యాలెన్స్‌తో జన్‌ధన్ ఖాతాలను ప్రారంభించి సంక్షేమ ఫలాల నగదును నేరుగా వారి ఖాతాల్లో నే జమ చేసిన చరిత్ర మోదీదేనని ఆమె స్పష్టం చేశారు.