calender_icon.png 6 September, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా అడిగితే కేసులతో బెదిరింపా?

06-09-2025 12:28:58 AM

గుండారపు కృష్ణారెడ్డి

ఎల్లారెడ్డిపేట,సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేటమండల మానుక లక్ష్మణ్ అనే రైతుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా కేసు పెట్టించారని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి,మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ. మానుక లక్ష్మణ్ అనే రైతు యూరియా అడిగితే బెదిరింపులకు పాల్పడుతూ బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త అని అతనిపై కేసు పెట్టడం హేయమైన చర్య అని అన్నారు.

రైతులకు సకాలంలో యూరియా అందించాలని,సకాలంలో యూరియా అందినట్లయితే ఎలాంటి నిరసనలు రైతుల నుండి ఎదురు కావని ఈ వి షయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు.

యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిపై కేసులు పెట్టడం సంస్కృతి కాదని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ హరి ఎలగందుల నరసింహులు,పందిర్ల పరుశురాములు గౌడ్,మీసం రాజం, మానుక నాగరాజు,రైతుకు మద్దతుగా రైతులు స్టేషన్ కుచేరుకున్నారు.