27 June, 2026 | 3:38 AM

ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వివరాలను నమోదు చేసుకోవాలి

27-06-2026 02:20 AM

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

చిట్యాల, జూన్ 26: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో ప్రతి ఒక్క ఓటరు బాధ్యతగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

శుక్రవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని తన నివాసంలో బీఎల్‌ఓ ద్వారా సర్ ఎన్యూమరేషన్ పత్రాలను స్వీకరించిన ఆయన, ప్రతి ఓటరు తమ ఓటుకు సంబంధించిన పూర్తి వివరాలను బీఎల్‌ఓలకు అందించి నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ-భిక్షం, ఏఎంసీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, టీయూవీ జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, వార్డు సభ్యులు పాకాల దినేష్, రూపని యాదయ్య తదితరులు పాల్గొన్నారు.