calender_icon.png 7 September, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్‌లో ఘనంగా వినాయకుని నిమజ్జనం

06-09-2025 12:30:21 AM

కొత్తపల్లి, సెప్టెంబరు 5 (విజయక్రాంతి): నగరంలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన వివిధ గణపతి మండపాల్లో నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై నిమజ్జన మహోత్సవ పూజలు నిర్వహించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు విఘ్నేశ్వరునికి విశిష్ట పూజ లను అందించడం, స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో పూజలను నిర్వహించడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. స్వామివారి పూజలు ఎన్నో లాభాలు కల్పిస్తాయని అన్నారు.

మహోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులుపాల్గొన్నారు.