calender_icon.png 6 September, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

జిల్లాలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

06-09-2025 12:28:30 AM

- 57 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం

- ముఖ్య అతిధి కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 5, (విజయక్రాంతి):తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి బి నాగలక్ష్మి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం ఘనంగా ఉ పాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులు గా నేర్చుకుంటూనే తరగతి గదిలో విద్యార్థుల సర్వతోముఖభి వృద్ధి కై పాటుపడాలని ఆ కాంక్షించారు.

ఉపాధ్యాయులు ప్రతీ విషయాన్నీ తాము ముందుగా చదువుకొని విష యం పై పట్టు పెంచుకోవాలన్నారు.విద్యార్థులు హోంవర్క్ చేసేలా చూడాలన్నారు . విశిష్ట అతిధి అశ్వారావుపేట శాసన సభ్యులు జారె ఆదినారాయణ మాట్లాడుతూ తాను ఉపాధ్యాయుడుగా వృత్తిని చేసిన రోజులను స్మరించుకుంటూ, ఉపాధ్యాయుల బోధనా విధానాలను బట్టే విద్యార్థులు వారి జీవితాల్లో చిరస్థాయి గా గురువులను గుర్తుం చుకుంటారని అన్నారు.

తాను విద్యార్థిగా, ఉపాధ్యాయుడుగా ఏజెన్సీ ప్రాంతంలో చ దువుకున్నని పనిచేసానని, రాష్ట్ర, దేశ స్థాయి లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాన్నారు.శాసన సభ్యులుగా ఎదగటానికి నాకు పేగుబంధం వున్న ఉపాధ్యాయులు ఎంతో సహకరించారని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూజిల్లా స్థా యిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఉపాధ్యాయులు అందరు తన దృష్టి లో ఉత్తమ ఉపాధ్యాయులే అన్నారు.

జిల్లా గ్రంధాలయ సంస్థ చెర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విద్య పై మంచి విజన్ వున్నదని, విద్యాశాఖాను తన దగ్గరే ఉంచుకొని ప్రత్యేక సంస్కరణలు తెస్తున్నారు అని అన్నారు.జిల్లా విద్యాశాఖాదికారిణి నా గలక్ష్మి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమం లు చే యటానికి మండలం స్థాయిలో రూ 5000 , జిల్లా స్థాయిలో రూ 15000 ప్రత్యేక నిధులు మంజూరు చేసారని, జిల్లా వ్యాప్తం గా 57 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ను  గుర్తించి వారికి శాలువా, ప్రశాంస పత్రము, జ్ఞాపిక లను అందచేస్తున్నట్లు తెలిపారు .

ట్రై నీ కలెక్టర్ సౌరభ శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని అన్నారు. నాకు గురువు ఈ జిల్లా కలెక్టర్ జితేష్ వి పా టిల్ అని కొనియాడారు. నేను ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నానని ఒక గురువు దగ్గర వి ద్య నేర్చుకుంటున్నానని ఇప్పటికే ఈ కలెక్టర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను అని తెలియజేశారు.కార్యక్రమం ప్రారంబానికి ముందు పలు పాఠశాలల విద్యార్థులు చేసిన స్వాగత నృత్యాలు అద్భుతంగా అలరించాయి. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్ లు నాగరాజ శేఖర్, సైదులు, సతీష్, అన్నమణి, కార్యక్రమ నిర్వహణ బాధ్యులు జంకిలాల్, బాలాజీ, నరేష్, ప్రేమ్.,ప్రెస్ ఇంచార్జ్ షేక్ దస్తగిరి,. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.