calender_icon.png 29 December, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లమలలో గుప్తనిధుల తవ్వకాలు.!

29-12-2025 10:23:21 AM

దుండగులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా  కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో(Nallamala Forest) గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి మొలచింతలపల్లి బీటు పరిధిలోని మెదరబండ సమీపంలో ఉన్న దేవుని బొక్క వద్ద కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం కొద్ది రోజులుగా అక్కడే మాకాం వేసి అక్రమ తవ్వకాలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాల్లో పాల్గొన్న దుండగులను అదుపులోకి తీసుకున్నారు.

గుప్త నిధుల తవ్వకాల కోసం ఉపయోగించిన సామాగ్రితో పాటు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కొల్లాపూర్ ఫారెస్ట్ డిపోకు తరలించారు. గత కొన్ని వారాలుగా దేవుని బొక్క గుహ ప్రాంతంలో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ముందుగా గుర్తించలేకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పురాతన రాతి విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పట్టుబడిన దుండగులను విచారణ కోసం అచ్చంపేట ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.