calender_icon.png 29 December, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

29-12-2025 10:47:16 AM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు(Telangana Assembly sessions begin) సోమవారం ప్రారంభం అయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు కేసీఆర్ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం వాకబు చేశారు. సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మణ్ రెడ్డి మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది.