calender_icon.png 29 December, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీకి కేసీఆర్

29-12-2025 10:39:38 AM

కేసీఆర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) అసెంబ్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రిజిస్టర్ లో కేసీఆర్ సంతకం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. సభ ప్రారంభం కాగానే సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. బీఏసీలో సభ పని దినాలపై నిర్ణయం తీసుకోనుంది. రేవంత్ సర్కార్ పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మూడంచెలుగా వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పెండింగ్ బిల్లుల కోసం ఇవాళ మాజీ సర్పంచ్ లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ముందస్తుగా మాజీ సర్పంచ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.