calender_icon.png 29 December, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్నాకుళం రైలుప్రమాదం.. హెల్ప్ లైన్లు నంబర్లు ఇవే

29-12-2025 11:14:28 AM

హైదరాబాద్: సోమవారం తెల్లవారుజామున విజయవాడ డివిజన్‌లోని(Vijayawada Division) ఏలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో 18189 నంబర్ టాటానగర్–ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్(Tatanagar–Ernakulam Express) రైలులోని రెండు బోగీలలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత రైల్వే అధికారులు అత్యవసర హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. రైలు రాకపోకలు, ప్రయాణికుల భద్రత, ఈ సంఘటనకు సంబంధించిన ఇతర సహాయంపై హెల్ప్‌లైన్‌లు తాజా సమాచారాన్ని అందిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం, సహాయం కోసం సమీపంలోని హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు. టాటా నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంతో పలు రైళ్లు ఆలస్యం అయ్యాయి. 

సహాయవాణి నంబర్లు 

ఎలమంచిలి: 7815909386

అనకాపల్లి: 7569305669

తుని: 7815909479

సమల్కోట్: 7382629990

రాజమండ్రి: 088-32420541, 088-32420543

ఏలూరు: 7569305268

విజయవాడ: 0866-2575167