calender_icon.png 29 December, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ప్రాణాలను కాపాడండి మహాప్రభో!

29-12-2025 02:48:33 AM

  1. హెటిరో పరిశ్రమను తరలించాలి

న్యాయం కోరితే కేసులు నమోదు చేస్తారా ?

విద్యార్థుల నిరసన

గుమ్మడిదల, డిసెంబర్ 28 :హెటీరో పరిశ్రమ వ్యర్థ రసాయనాల వల్ల మా ప్రాణాలు పోకుండా రక్షించండని సంబంధిత అధికారులను అడిగితే తమపై కేసులు నమోదు చేస్తారా అంటూ దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాన్ని కేసుల రూపంలో నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్న రెవెన్యూ అధికారులకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

ఏదేమి జరిగినప్పటికీ తమపై కేసులు పెట్టినా ఉద్యమం ఆగదని, పరిశ్రమను ఎత్తివేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఆదివారం విద్యార్థులు సైతం మా ప్రాణాలకు హాని కలుగుతుందని స్వచ్ఛందంగా నిరసన తెలిపారు. పరిశ్రమపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించడంలో అలసత్వం విడాలని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ గ్రామానికి ముప్పు వాటిల్లుతుందని గ్రామ పెద్దలు పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని దోమడుగు గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు, పాడి పశువులకు, వ్యవసాయ రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి మా గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దోమడుగు అమరవీరుల స్తూపం నుండి బొంతపల్లి కమాన్ వరకు విద్యార్థులు ప్లకార్డులతో హెటిరో పరిశ్రమను మూసివేయాలని, ఇక్కడి నుండి తొలగించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. 

కలెక్టర్ గ్రామానికి రావాలి..

జిల్లా కలెక్టర్ దోమడుగు గ్రామానికి విచ్చేసి గత రెండు నెలలుగా నడుస్తున్నటువంటి హెటిరో పరిశ్రమ వ్యర్థ జలాల పంచాయితీని ప్రత్యక్షంగా సందర్శించాలి. మా గ్రామ ప్రజల అష్ట కష్టాలు తెలుసుకొని వాస్తవాలు ఉంటేనే మాకు న్యాయం చేయండి. ఇష్టారీతిగా వ్యర్థ జలాలను వదిలిపెడుతున్న హెటిరో పరిశ్రమను తరలించేలా చర్యలు తీసుకోవాలి.    

ఉమామహేశ్వరి, విద్యార్థిని

న్యాయం జరిగేలా చూడండి...

మా గ్రామ సమస్యను జిల్లా ఉన్నతా ధికారుల దృష్టికి తీ సుకుపోవడంలో తహసీల్దార్ ముఖ్యపాత్ర వహించాలి. మా సామాన్య ప్రజ ల మనోభావాలను పరిగణలోకి తీసుకొని న్యాయం జరిగేలా చూడాలి. పరిశ్ర మ యాజమాన్యా నికి కొమ్ముకాస్తున్నట్లుగానే అధికారుల తీరు కనిపిస్తోంది. వెంటనే సంబంధిత జిల్లా ఉన్నత అధికారులు స్పందించాలి. 

- - శివాని, విద్యార్థిని