calender_icon.png 29 December, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్ల అయింది..! కేసు పెట్టి ఏం చేశారు?

29-12-2025 12:32:47 PM

గూఢచారి వ్యవస్థ సహజం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేయడం లేదా?

హైదరాబాద్: రెండేళ్ల అయింది నాపై కేసు పెట్టి ఏం చేశారు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. మళ్లీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, నోటీసులు అంటున్నారు. ముఖ్యమంత్రికి సమాచారం వస్తుంది. సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీసుకున్నారనేది సీఎంకు సంబంధం ఉండదన్నారు. గూఢచారి వ్యవస్థ ఏ ప్రభుత్వంలో అయినా సహజమని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా?, కేంద్రం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా? ఇప్పుడు కొందరు అధికారులు బలిపశువులు అవుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు ఉన్న అధికారుల పరిస్థితి రేపు ఏమిటి ? అన్నారు. శివధర్ రెడ్డి నాడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేయలేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాజకీయ అస్థిరత లాంటివి ఉన్నప్పుడు గూఢచారి వ్యవస్థ తన పని తాను చేసుకుంటుందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నాడు ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర చేయలేదా?, ఎన్ని కేసులు, విచారణలు అన్నారు.. ఏం చేశారు?. ఫోన్ ట్యాపింగ్ పైఅధికారికంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం లేదు? లీకులు తప్ప అన్నారు. ఒక సిట్ ఏమైంది.. ఇంకో సిట్ వేశారని కేటీఆర్ స్పష్టం చేశారు.