calender_icon.png 29 December, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డి తిట్లు నాకు దీవెనలు

29-12-2025 12:16:27 PM

రేవంత్ రంధ్రాన్వేషణ వల్ల రాష్ట్రానికి నష్టం

రేవంత్ కు కోపం, ఉక్రోషం ఎందుకు?

హైదరాబాద్: కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని పాలమూరు-రంగారెడ్డి పనులు(Palamuru-Rangareddy works) చేయట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. చంద్రబాబు కోపం వస్తుందని పాలమూరు-రంగారెడ్డి పనులు చేయట్లేదని కేటీఆర్ ఆరోపించారు. కాల్వల కోసం పిలిచిన టెండర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని కేటీఆర్ సూచించారు. గోదావరిలో నీటి హక్కుల కోసమే కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులు కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) చేపట్టారని ఆయన వివరించారు.

పాలమూరు-రంగారెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి రంధ్రాన్వేషణ వల్ల  రాష్ట్రానికి నష్టం జరుగుతోందన్నారు. అనుమతులు దృష్టిలో ఉంచుకుని తాగునీరు పేరుతో పనులు చేశామని తెలిపారు. కేసీఆర్ చిత్తశుద్ధి కాళేశ్వరం(Kaleshwaram) విషయంలో చూడాలన్నారు. పోలవరం, కాళేశ్వరం పోలిస్తే అన్నీ అర్థం అవుతాయని తెలిపారు. జీవితాశయం సాధించిన సీఎం రేవంత్ రెడ్డికి కోపం, ఉక్రోషం ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) దోపిడీని అడుగడుగునా అడ్డుకుంటున్నందుకే దూషిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి తిట్లు నాకు దీవెనలు అని కేటీఆర్ వెల్లడించారు. తనను తిడిగే పడతాను కానీ కేసీఆర్ ను అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.