స్వీయ గణనలో భాగస్వాములు కావాలి
ఆధునిక సాంకేతికతో డిజిటల్ జన గణన..
ప్రజల నుండి సేకరించిన సమాచారం గోప్యంగా భద్రపరుస్తాం..
సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1855ను సంప్రదించవచ్చు.
తన పేరును నమోదు చేసుకున్న కరీంనగర్: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్,(విజయక్రాంతి): జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతి ఒక్కరు తమ వివరాలను స్వయంగా నమోదు( స్వీయ గణన) చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలో చేపడుతున్న జనగణనలో భాగంగా స్వీయ గణన కార్యక్రమంపై ఆదివారం పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్వీయ గణనలో ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా ఫోన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇది సులభమైన సురక్షితమైన పారదర్శకమైన విధానమని పేర్కొన్నారు.
జనాభా గణనలో గృహముల నివాసయోగ్య స్థితి, వసతులు మతము, షెడ్యూల్ కులాలు, షెడ్యూలు తెగలు, కుటుంబ యజమాని పేరు త్రాగునీటి వసతి గృహ వినియోగం ఇంధనం వంటి వివరాలతో కూడిన 34 రకాల ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. ఈ సమాచారం దేశ ప్రగతి .అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. వెబ్ se.censes.giv.in ఈ పోర్టల్ ద్వారా ప్రజల తమ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి గృహాన్ని జియో ట్యాగ్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. నమోదు పూర్తయిన తర్వాత హెచ్ తో ప్రారంభమయ్యే 11 అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి జనరేట్ అవుతుందన్నారు. ప్రజలు తమ కుటుంబ వివరాలను సుమారు 15 నిమిషాల్లో నమోదు చేసి ఈ ప్రత్యేకమైన సెల్ఫ్ ఇన్వరేషన్ ఐడి పొందవచ్చన్నారు.
స్వీయ గణన నమోదు అనంతరం వచ్చిన ఐడిని భద్రపరచుకొని ఇండ్ల గణన సమయంలో ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్ కు ఐడి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గృహాల జాబితా లెక్కింపు సమయం ఎన్యుమరేటర్లు సూపర్వైజర్ల ద్వారా తమ తమ కుటుంబ వివరాలనుధ్రువీకరిస్తారని తెలిపారు. రు. జిల్లాలో వివిధ శాఖల అధికారులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు మెడికల్ సిబ్బంది క్రీడాకారులు కళాకారులు జనాభా గణన విధులు నిర్వర్తిస్తున్న అధికారులు బ్యాంకింగ్ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు అంగన్వాడి ఏఎన్ఎం ఆశా వర్కర్లు ప్రజలు స్వీయ గణనలో పాల్గొనేలా కృషి చేసేందుకు బాధ్యతాయుత అధికారులను నియమించామని తెలిపారు.
స్వీయ గణనకు జిల్లా కలెక్టర్ శ్రీకారం..
జనాభా గణానలో భాగంగా స్వీయ గణనకు జిల్లాలో కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదివారం శ్రీకారం చుట్టారు. కలెక్టర్ స్వయంగా తన వివరాల నమోదు చేసుకొని స్వీయ గణన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జనాభా గణన ఒక జాతీయ కీలక కార్యక్రమం అని పేర్కొన్నారు. కలెక్టర్ తో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి. ఆర్ డి ఓ మహేశ్వర్, జిల్లా ప్రణాళిక అధికారి రామ్ దత్తారెడ్డి తమ వివరాలు నమోదు చేసుకున్నారు.






