1 September, 2026 | 12:00 AM

రాహితీ పాసులు ఇవ్వాలని జెసికి వినతి

31-08-2026 11:12 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న నియోజకవర్గస్థాయి పాత్రికేయులకు రాయితీతో కూడిన స్టేట్ బస్‌ పాస్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్‌ (టీఎస్‌జేయూ) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌ లో వినతిపత్రం అందజేశారు. గతంలో నియోజకవర్గస్థాయి పాత్రికేయులకు రాయితీ స్టేట్ బస్‌ పాస్ సౌకర్యం ఉండేదని అన్నారు. ప్రస్తుతం జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు కలిగిన పాత్రికేయులకు ఉమ్మడి జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత బస్‌ పాస్ సౌకర్యం కల్పిస్తున్నారని పేర్కొన్నారు.