23-02-2026 01:05:48 AM
శిథిలావస్థకు చేరిన పశువుల నీటి తొట్టెలు
తాగునీటికి పశువులకు ఇక్కట్లు
మరమ్మతులతో తీరనున్న మూగజీవుల దాహార్తి
ఉట్నూర్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): వేసవి కాలంలో ఓవైపు ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. దీంతో వాగులు.. వంకల్లోని నీటి మట్టం అడుగంటిపోతోంది. మరోవైపు జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 473 గ్రామ పంచాయతీలో పరిధి లోని గ్రామాల్లో పశువులకు తాగు నీటి తొట్టెలను జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్మించారు. ఈజీఎస్ నిధులతో నిర్మించిన పశువుల తాగునీటి తొట్టెల నిర్వహణను సంబంధిత పంచాయతీ అధికారులకు అప్పగించారు. కానీ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో నీటి తొట్టెలు నిరుపయో గంగా మారి శిథిలావస్థకు చేరుకున్నారు.
పాడి పశువులకు తాగునీటి ఇబ్బంది
పాడి పశువులకు గ్రామాల్లో పశువులు తాగునీటి తొట్టెల గతంలో నిర్మించి నీటి వసతిని కల్పించారు. నీటి తొట్టె ల నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్న సంబంధి త శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీంతో వృథాగా మరి వినియోగంలో లేక జిల్లాలో వేలాది నీటి తొట్టెలు శిథిలవస్థకు చేరుకున్నాయి. ఇప్పటికైనా పశువుల తాగునీటి తొట్టెలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని రైతులు, పశువుల పెంపకందారులు కోరుతున్నారు.
తాగునీటి తొట్టెలపై పర్యవేక్షణ కరువవడంతో జిల్లాలో దాదాపు 80 శాతం నీటి తొట్టెలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పని చేస్తున్న కొన్ని తొ ట్టెలలో పాకురు పట్టి, పగుళ్లు ఏర్పడి పశువు లు నీరు తాగాలేని విధంగా మారాయి. వేస వి కాలం ప్రారంభమైనందున అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పశువుల దాహార్తి తీర్చేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.