12 June, 2026 | 9:22 PM

వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

12-06-2026 08:20 PM

కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ విక్టర్ 

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట సొసైటీ పరిధిలో గల ఆత్మకూర్, జలాల్పూర్,రాఘవపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్, డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా తాండూర్ సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం నుండి వాహనాలు సరిగ్గా రాకపోవడంతో ఇంకా చాలా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం నిల్వ ఉంది.

అకాల వర్షాల వల్ల నింపిన బస్తాలు తడవడం జరిగిందని కావున లారీలను ఎక్కువ సంఖ్యలో పంపించి త్వరగా ధాన్యం తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ విక్టర్కు వివరించారు.దానికి జెసి స్పందిస్తూ పూర్తి ధాన్యాన్ని తరలించేందుకు లారీలు ఏర్పాటు చేసి వెంబడే మిల్లులకు తరలించి పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆత్మకూర్,జలాల్పూర్ సర్పంచులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,మానిటరింగ్ అధికారి లక్ష్మణ్, సీఈవో మురళి,రైతులు ఉన్నారు.