12 June, 2026 | 9:47 PM

జర్నలిజం విలువలు మరింత పెరగాలి

12-06-2026 08:32 PM

జర్నలిస్టులు నిజమైన వార్తలను రాయాలి  

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): జర్నలిజం విలువలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని, జర్నలిస్టులు నిజమైన వార్తలను రాసినప్పుడే విలువలు పెరుగుతాయని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో టీయూడబ్ల్యూజే (ఐజేయు), మూడవ జిల్లా మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వస్తున్న కథనాల లో ఏది నిజమో ఏదీ అబద్ధం వార్త అనేది తెలియని గందరగోళ కూడా పరిస్థితి పాఠకులకు కలుగుతుందన్నారు. విలువలు గల జర్నలిస్టులు, పత్రికలు కొన్ని ఇంకా మిగిలి ఉన్నందున ప్రజాసమస్యలు పరిష్కరం అవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.

గ్రామీణ విలేకరులు సమస్యలపై వార్తలు రాస్తే సమాజాభివృద్ధి జరుగుతుందని వ్యాపార వేత్త టీ.సుభాష్ రెడ్డి అన్నారు. తాను ఒక్క పాఠశాలను నిర్మిస్తే తనను స్ఫూర్తిగా తీసుకుని దాతల ద్వారా 27 పాఠశాలలు నిర్మించారని ఇది పత్రికల ద్వారానే మార్పు జరిగిందన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహాత్ అలీ మాట్లాడుతూ... గత 70 సంవత్సరాలుగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టుల సమస్యల పట్ల పోరాటం చేస్తుందన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. జర్నలిస్టులకు అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు. ఇండ్ల స్థలాల సమస్య, ఆరోగ్య కార్డు, అక్రిడేషన్ల కార్డుల కోసం పోరాటం చేస్తున్నమన్నారు.

టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాలు జర్నలిస్టులకు హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదన్నారు. జర్నలిస్టుల కోరికలు గొంతామ్మ కోరికలు కావని, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి మాట్లాడుతూ జర్నలిస్టులు ఎన్నో సమస్యలను అధిగమిస్తూ వార్త సేకరణలో పోటీ పడుతున్నారు అన్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. స్థానికంగా  జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.

జిల్లా అధ్యక్షునిగా వీ రజినీకాంత్, ప్రధాన కార్యదర్శిగా తోట రాజేష్, కోశాధికారిగా ముద్దాం. వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా సయ్యద్ కౌసల్ అలీ, ముదాంశంకర్, ఆబిద్, బాలయ్య, ఎండి యూనస్, సహాయ కార్యదర్శలుగా మొసర్ల శ్రీనివాస్ రెడ్డి, సాయి ప్రసాద్, కే శ్రీనివాసరావు, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులుగా వింజమూరు శ్రీనివాస్, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, గంగాధర్, బాల ప్రకాష్, వాజిద్ అలీ, శ్రీనివాస్, మేకల రవి, భవాని, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా పట్నం శ్రీనివాస్, కార్యదర్శిగా సుధాకర్ గౌడ్, కోశాధికారిగా సత్యనారాయణ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎంఏ మాజీద్, సహాయ కార్యదర్శిగా రామేశ్వరరావు, సాయిరాం, వీరయ్య, రవీందర్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా ఆవు నూరి ఆశన్న, ఎండి రజాక్, పోచయ్య, గంగాధర్, బన్సీలాల్, దినకర్, ప్రవీణ్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా లస్కర్ సత్యనారాయణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఇంద్రసేనారెడ్డి, లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.