టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా దినేష్
08-08-2026 12:00 AM
జూబ్లీహిల్స్, ఆగస్టు 7 (విజయక్రాంతి): టీపీసీసీ సోషల్ మీడియా విభాగానికి కో-కోఆర్డినేటర్గా దినేష్ (సోను) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.






