బ్రహ్మాజీవాడిలో వైద్య పరీక్షలు
08-08-2026 12:00 AM
తాడ్వాయి,ఆగష్టు, 7( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి గ్రామంలో శుక్రవారం ప్రత్యేక వైద్య దిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరం ఉన్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజనాబాయి రఘుపతిరావు,ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సిబ్బంది తదితరు పాల్గొన్నారు.






