17 June, 2026 | 11:57 AM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

ప్రహరీ నిర్మాణ పనులు నిలిపి వేయాలని స్టే విధించిన హై కోర్టు

07-02-2026 05:52 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి వెళ్లే రోడ్డు వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు మూడు వారాలు స్టే విధించింది. ఎన్టీఆర్ కాలనీకి ఆనుకొని ఉన్న ఆర్టీసీ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించేందుకు గత కొద్ది నెలల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం బేస్మెంట్ వరకు నిర్మించారు. ప్రహరీ నిర్మిస్తే తమ కాలనీకి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదని కాలనీ వాసులు విన్నవించారు. రోడ్డు కోసం 20 ఫీట్ల స్థలాన్ని వదిలేసి ప్రహరీ నిర్మించుకోవాలని ఆర్టీసీ అధికారులకు, మున్సిపల్, రెవెన్యూ అధికారులకు విన్నవించారు.

సమస్య జటిలం కావడంతో అధికారులు కొద్ది రోజులు  నిర్మాణ పంజలను నిలిపివేశారు. ఈ మధ్య మళ్లీ నిర్మాణ పనులు చేపట్టాలని నిర్మాణ సామాగ్రిని తరలించారు. దీంతో కాలనీవాసులు విజయ్ అగర్వాల్ సహకారంతో హైకోర్టులో కొద్దిరోజుల క్రితం కేసు వేశారు. శుక్రవారం రోజున బెంచ్ పైకి రావడంతో వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి మూడు వారాలు స్టే విధించారు. ఎలాంటి నిర్మాణాలు జరపకుండా మూడు వారాలపాటు యథా తదంగా ఉంచాలని, కాలనీ వాసుల విజ్ఞప్తిని పరిగణలోకి  తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఆర్టీసీ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు.

ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు స్టే కాపి చేతికి అందేలోపే ప్రహరిని నిర్మించాలని సన్నద్ధం అయ్యారు. బందోబస్తు కోసం పోలీసు అధికారులను సంప్రదించారు. ఇందుకోసం అన్ని సిద్ధం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు హుటా హుటీనా హైదరాబాద్ నుంచి స్టే కాపి తీసుకొచ్చి ఆర్టీసీ డిఎంకు అందజేశారు. దీంతో ప్రహరి నిర్మాణ పనులను అధికారులు విరమించుకున్నారు. నిర్మాణ పనులను అధికారులు విరమించుకోవడంతో కాలనీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తమకు  సహకరించిన విజయ అగర్వాల్ కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.