23 March, 2026 | 3:33 AM

ఇల్లందు ఏరియా కోయగూడెం ఓసీలో పర్యటించిన డైరెక్టర్(పి.పి)

23-03-2026 12:22 AM

ఇల్లెందు, మార్చ్ 22, (విజయక్రాంతి): సింగరేణి డైరెక్టర్ (పి. పి.) కే వెంకటేశ్వర్లు, ఆదివారం సింగరేణి ఇల్లందు ఏరియా కోయగూడెం ఓ.సి.లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన కే.ఓ.సి. వ్యూ పాయింట్ నుంచి పని స్థలాలను సందర్శించి అక్కడ జరుగుచున్న పనులను పరిశీలించారు. ప్రాజెక్టులో జరుగుతున్న రోజు వారి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను, భద్రతా చర్యలు, యంత్రాల పనితీరు తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. పనులను నాణ్యతతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు తీసుకెళ్లాలని అలాగే జి.యం వి.కృష్ణయ్యకి తెలియజేసినారు.

అంతేకాక బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచే జి.13 బొగ్గు ఉత్పతి అయ్యేలాగా చూడాలని, ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి తీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి.ఓ కే.ఓ.సి. గోవింద రావు, పి.ఓ జే.కే.ఓ.సి జాకీర్ హుస్సేన్, డి.జి.యం (సివిల్) రవి కుమార్, డి.జి.యం. (ఏరియా వర్క్ షాప్) నాగరాజు నాయక్, కే.ఓ.సి మేనేజర్ శ్రీనివాస రావు, క్వాలిటీ మేనేజర్ రామదాసు, సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి, ఇతర అధికారులు, ఉద్యుగులు పాల్గొన్నారు.