23 March, 2026 | 2:03 AM

మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి

23-03-2026 12:23 AM

ఎమ్మెల్యే మాణిక్ రావు 

జహీరాబాద్, మార్చి 22 : జహీరాబాద్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కోసం వివిధ పనులు ప్రారంభించినట్లు స్థానిక ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అన్నారు. ఆదివారం నాడు జహీరాబాద్ మండలంలోని సిసి రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి 50 లక్షల నిధులతో పనులు ప్రారంభించారు. గోవింద్పూర్ లో రూ.30.25 లక్షల జిపి నిధులతో మురుగు కాలువలు ద్వారా పనులు ప్రారంభించారు. రాయిపల్లి డి.ఉగ్గేల్లి తండా అల్గోల్ బూచినెల్లిలో ఐదు లక్షల చొప్పున పనులకు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వసతులు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, గ్రామాల అభివృద్ధి కోసం రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వంటి సదుపాయాలు మరింతగా మెరుగుపరచడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, నాయకులు పెంటారెడ్డి, హోతీ బి సర్పంచ్ మచ్చేందర్, గోవింద్పూర్ సర్పంచ్ కవిత వెంకట్, రాయిపల్లి సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఏసురత్నం, హుగ్గేల్లి తండా సర్పంచ్ గినిబాయి, అల్గోల్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, బూచినేని సర్పంచ్ సునీత శ్రీనివాస్, నాయకులు వీరిశెట్టి రాజు, ఖలీల్, నర్సింలు, శేఖర్ పటేల్, విజయ్, స్వామి దాస్, అమర్నాథ్ రెడ్డి, మోహన్, వసంత్ రాథోడ్, భీమ్ రావు నాయక్, బిక్కు రాథోడ్, సంజయ్ బిక్కు, బాబు, చంద్రకాంత్ రెడ్డి, ప్రభాకర్, శ్రీకాంత్, అనిల్, నర్సింలు, శ్యామ్, గోవింద్ రెడ్డి, అబ్బాస్, వినాయక తదితరులు పాల్గొన్నారు.