calender_icon.png 28 January, 2026 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోట్ నుంచి రైజ్ ఆఫ్ గణ సాంగ్ విడుదల

27-01-2026 01:06:19 AM

ప్రముఖ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ’గోట్’. ’గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్కు, సాంగ్స్కు అనూహ్య స్పందన వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి రైజ్ ఆఫ్ గణ అనే లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేసింది చిత్రయూనిట్. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సంగీతం అందించారు. చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్ను తెలిపే విధంగా ఎంతో పవర్ఫుల్ మాస్గా ఈ సాంగ్గా ఉండబోతుంది. సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్, రాజేంద్రన్, ఆనంద్ రామరాజ్, చమ్మక్ చంద్ర, పమ్మీ సాయి, నవీన్ నేని, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్; నేపథ్య సంగీతం: మణిశర్మ; డీఓపీ: రసూల్ ఎల్లోర్; ఎడిటర్: విజయ్ ముక్తవరపు;ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్.