calender_icon.png 15 January, 2026 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ వలలో డైరెక్టర్ తేజ కొడుకు

15-01-2026 02:11:25 AM

  1. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.72 లక్షలు స్వాహా
  2. అధిక లాభాల ఆశచూపి నిలువునా ముంచిన దంపతులు
  3. పోలీసులను ఆశ్రయించిన అమితవ్ తేజ
  4. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (విజయక్రాంతి): సినీ దర్శకుడు తేజ కొడుకు అమితవ్ తేజ సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో కేటుగాళ్లు వేసిన గాలానికి రూ.72 లక్షలు మోసపోయారు. స్టాక్ మార్కెట్, ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో తమకు అనుభవం ఉన్నదని, తమ ద్వారా పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే ఊహించని లాభాలు వస్తాయని ఓ దంపతులు అమితవ్ తేజను నమ్మించారు.

నిజమేనని నమ్మిన అమితవ్.. విడతల వారీగా మొత్తం రూ.72 లక్షలను ఆ దంపతుల ఖాతాలకు బదిలీ చేశారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఆ దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేదు. రోజులు గడుస్తున్నా లాభాలు రాకపోగా, కనీసం తాను పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి ఇవ్వకపోవడంతో అమితవ్ వారిని నిలదీశారు. దీంతో నిందితులు పొంతన లేని సమా ధానాలు చెపుతూ దాటవేశారు.

చివరికి ఫోన్ నంబర్లు కూడా మార్చేసి పరారయ్యారు. మోసపోయానని గ్రహించిన అమితవ్ తేజ జూబ్లీహి ల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సదరు దంపతులపై ఐటీ యాక్ట్, చీటింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఎవరు? ఎంతమందిని ఇలా మోసం చేశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.