మాంజా విక్రెతల అరెస్టు
15-01-2026 02:09 AM
- చైనా మాంజా స్వాధీనం
నలుగురి అరెస్ట్
ముషీరాబాద్, జనవరి14 (విజయక్రాంతి): నలుగురి అక్రమ మాంజా విక్రెతలను అరెస్టు చేసినట్లు దోమలగూడ పోలీసులు బుధవారం తెలిపారు. దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నలుగురు విద్యార్థుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వారిలో కవాడిగూడకు చెందిన ప్రశాంత్ (20), గాంధీ నగర్ కు చెందిన అఖిల్ (19), కవాడిగూడకు చెందిన పవన్ (19), దూల్ పేట శివలాల్ నగర్ కు చెందిన దీపక్ (19) లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 8 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. చైనా మాంజా వల్ల ప్రజలకు, పక్షులకు ముప్పు ఏర్పడుతుండటంతో నిషేధిత మంజాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.




