calender_icon.png 5 December, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగవైకల్యం మనోస్థైర్యానికి అడ్డుకాదు: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

05-12-2025 01:43:48 AM

రాజేంద్రనగర్, డిసెంబర్ 4  (విజయ క్రాంతి): అంగవైకల్యం మనో స్టైర్యానికి ఏమాత్రం అడ్డు కాదని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని గురువారం రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వికలాంగులకు చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.... అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనోసైర్యానికి ఏమాత్రం అడ్డు కాదన్నారు. నేడు ఎందరో వికలాంగులు వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. చలి తీవ్రతంగా ఉండడంతో వికలాంగులకు ఉచిత బ్లాంకెట్స్. రఘులను  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వికలాంగులకు 28 లక్షల  చెక్కులను పంపిణీ చేశారు.  రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి, రాజేంద్రనగర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.