7 March, 2026 | 4:59 PM

వివాహిత అదృశ్యం

06-03-2026 07:56 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): వివాహిత అదృశ్యం అయిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేడిపల్లి స్వరూప్ నగర్ కాలనీలో నివసించే కళ్ళు కీర్తి(34) గత కొంతకాలంగా బట్టల వ్యాపారం చేస్తున్నదని, వ్యాపారం అభివృద్ధి కొరకు తెలిసిన వాళ్ళ దగ్గర కొంత నగదు అప్పుగా తీసుకున్నరని, వ్యాపారంలో నష్టం రాగా అప్పుల బాధ భరించలేక గత నెల 28 తేదీన ఎవరికి చెప్పకుండా  ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదని, చుట్టుప్రక్కల వెతికిన ఆచూకీ లభించకపోవడంతో, ఆమె కొడుకు రాహుల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.