బజార్ వాడలో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ
కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్
కుమ్రంభీం అసిఫాబాద్(విజయక్రాంతి): పట్టణంలోని బజార్ వాడిలో శుక్రవారం పారిశుద్ధ్య పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా ప్రతి వీధిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు.
రోడ్లు ఊడుస్తున్న కార్మికులతో నేరుగా మాట్లాడిన ఆయన, వారి పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, పారిశుద్ధ్య విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజిద్, సమద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




