9 July, 2026 | 9:15 AM

దీపక్ పునియాకు నిరాశ

12-05-2024 01:36 AM

ఇస్తాన్‌బుల్: భారత స్టార్ రెజ్లర్ దీపక్ పునియాకు నిరాశ ఎదురైంది. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా వరల్డ్ క్వాలిఫయర్స్ టోర్నీ బరిలోకి దిగిన దీపక్ తొలి (86 కేజీలు) రౌండ్‌లోనే పరాజయం పాలయ్యాడు. మరోవైపు యువ రెజ్లర్లు అమన్ షెరావత్, సుజీత్ పారిస్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచారు. పురుషుల విభాగంలో భారత్ నుంచి ఇప్పటి వరకు ఒక్క రెజ్లర్ కూడా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోగా.. శనివారం పోటీల్లో పునియా ఆకట్టుకోలేకపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్న దీపక్ ఈసారి విశ్వక్రీడలకు దూరమయ్యాడు.