25 April, 2026 | 7:45 PM

కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ

10-05-2024 02:30 AM

జన జాతర సభకు ఖాళీగా కనిపించిన స్టేడియం

జనం పలుచగా రావడంపై జోరుగా చర్చ

మహేశ్వరం, మే 9: సరూర్ నగర్ స్టేడియంలో గురువారం కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర సభ పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేసింది. మూడు లోక్‌సభ స్థానాల పరిధిలో కలిపి స్టేడియంలో సభను ఏర్పాటు చేయడంతో సభకు భారీ గా జనం తరలివస్తారని అంతా ఆశించారు. అంతేకాకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అ తిథిగా హాజరవుతుండటంతో ప్రజ లు పెద్ద ఎత్తున వస్తారని ఆశలు పెట్టుకున్నారు.

కానీ సాయంత్రం సభ ప్రారంభమయ్యే సమయానికి స్టేడియంలో జనం పలుచగా కనిపించడంతో సీనియర్ నాయకుల్లో ఆందోళన కనిపించింది. నిన్న మొ న్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ సభ నిర్వహించిన జనం కిక్కిరిసిపోయేవారు. దీంతో సరూర్ నగర్ స్టేడియంలో జరిగే సభకు కూడా పెద్ద ఎత్తున వస్తారని, సభ భారీ సక్సెస్ అవుతుందని భావించారు. కానీ నాయకుల నిర్లక్ష్యమో లేక వర్షం వస్తుందన్న భావనతో జనం సభకు రాలేదో తెలియదు కానీ.. సభ అనుకున్నంత సక్సెస్ కాలేదనేది కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిం చింది. జనం పలుచగా రావడంతో రాహుల్ గాంధీ కూడా కొద్ది నిమిషాల్లోనే ప్రసంగం ముగించినట్లు కనిపించింది.