కాంగ్రెస్ మాట తప్పదు
మంత్రి జూపల్లి కృష్ణారావు
రంగారెడ్డి, మే 9 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలు చేస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మండలం అయ్యసాగర్ క్షేత్ర సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మహిళా సంఘం సమావేశంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. పదేళ్లలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించా రు.
మళ్లీ కొత్త హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసేందుకు చూస్తున్నా రని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో డిపాజిట్లు దక్కే పరి స్థితి లేదన్నారు. కేంద్రంలో ఇండి యా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానంలో మల్లు రవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మల్లు రవి సతీమణి రాజా భన్సీదేవి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇందిరా శోభ, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, యాట నర్సింహ, మో త్యానాయక్, జగన్ పాల్గొన్నారు.






