18 March, 2026 | 11:41 AM

Breaking News

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •   తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!   •  

2 వేల మందితో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్

16-10-2024 01:49 AM

వచ్చే నెల మొదటి వారం నుంచి శిక్షణ

ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎస్

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో సుమారు 2 వేల మందితో తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (టీజీడీఆర్‌ఎఫ్) ఏర్పాటు చేస్తున్నామని రాష్ర్ట ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో డీజీపీ జితేందర్, డిజా స్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశమై తెలంగాణ రాష్ర్ట డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించారు.

ఇటీవల రాష్ర్టం లో సంభవించిన వరదలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన ఘటనల నేపథ్యంలో అగ్నిమాపక శాఖకు చెం దిన 10 బృందాలు, తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లోని 10 కంపెనీలను వినియోగించి తెలంగాణ రాష్ర్ట డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు.

సుమారు 2000 మంది తో బలగాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ కూడా సీఎం మంజూరు చేశారని ఆమె తెలిపారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. వచ్చేనెల మొదటి వారం నుంచి మొదటి బ్యాచ్ సిబ్బందికి శిక్షణను ప్రారంభించాలని ఆమె తెలిపారు.

రెస్క్యూ ఆపరేషన్లకు అవసరమైన వాహనాలు, రెస్క్యూ పరికరాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇతర సాధనాల సేకరణ గురించి సమావేశంలో చర్చించారు.

అవసరమైన పరికరాలు, శిక్షణ అందించడం ద్వారా అగ్నిమాపక శాఖలోని 10 బృందాలను ఎస్‌డీఆర్‌ఎఫ్ స్టేషన్‌లుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సీఎస్‌కు డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి వివరించారు. అదేవిధంగా టీజీఎస్‌పీ బెటాలియన్ల నుంచి మొత్తం 1000 మంది అగ్నిమాపక శాఖ సిబ్బందితో సమానంగా శిక్షణ పొందుతారని పేర్కొన్నారు.