విధుల్లో అలసత్వం.. 8 మంది అంగన్‌వాడీలపై క్రమశిక్షణ చర్యలు
* సిబ్బంది సేవల రద్దు చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
అచ్చంపేట: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ హెచ్చరించారు. అచ్చంపేట, బల్మూర్, కొల్లాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని వివిధ అంగన్వాడి కేంద్రాల్లో విధులకు రాకుండా అలసత్వం వహిస్తున్న అంగన్వాడి సిబ్బందిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎంఎస్. నెం.14 నిబంధనల మేరకు.. దీర్ఘకాలంగా విధులకు హాజరుకానీ అంగన్‌వాడీ టీచర్లు కార్యకర్తలు, ఆయాల సేవలను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు.
అచ్చంపేట, బల్మూర్, కొల్లాపూర్ ప్రాజెక్టుల పరిధిలోనీ అంగన్‌వాడీ సిబ్బంది 2023 ఫిబ్రవరి నుంచి 2026 జనవరి వరకు వివిధ కాలాల్లో విధులకు గైర్హాజరవుతున్నట్లు రికార్డులు వెల్లడించినట్లు తెలిపారు. సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం వారి తొలగింపునకు ప్రతిపాదనలు సమర్పించగా, వాటికి ఆమోదం లభించినట్లు చెప్పారు.
* వీరినీ తొలగింపు
అచ్చంపేట ప్రాజెక్టుకు చెందిన జి. వెంకటమ్మ, ఎస్. అరుణ, బల్మూర్ ప్రాజెక్టుకు చెందిన జి. సుల్తానమ్మ, జె. మహాలక్ష్మి, కొల్లాపూర్ ప్రాజెక్టుకు చెందిన సి. పద్మావతి, నిరంజన్‌బెల్ల, కాశమ్మ, దర్జి బక్కమ్మలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ విధుల పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.






