24-07-2025 05:46:06 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ ముఖ్యమని అర్బన్ మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు(Education Officer Venkateshwarlu) అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో స్కూల్ లీడర్ల ఎంపిక ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిఓ కుష్బూ జిల్లా అధికారి అంబాజీ నాయక్ ఆదేశాల మేరకు ఎన్నికలను నిర్వహించడం జరిగిందని విద్యార్థుల చేత ఎన్నికైన వారు పాఠశాలలో క్రమశిక్షణ లీడర్షిప్ ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. అనంతరం ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజమౌళి ఉపాధ్యాయులు పి గజ్జరం నాందేవ్ జై శ్రీ తుకారం తదితరులు ఉన్నారు.