calender_icon.png 5 August, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో భారీ వర్షాలు.. కలెక్టర్లు, అధికారులకు సీఎం ఆదేశం

24-07-2025 05:42:11 PM

హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అక్కడి నుంచి సీఎంవో అధికారులతో మాట్లాడారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. అదేవిధంగా నీటిఉద్ధృత్తి ఉన్న ప్రాంతల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, భారీ వర్షా సూచన ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చిన ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలన్నారు.