24-07-2025 05:47:58 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్(Telangana State Residential Educational Institute) సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ లో నిర్వహించబడుతున్న బాలికల గురుకుల పాఠశాలలో గురువారం బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల యందు ఎనిమిదో తరగతిలో రెండు సీట్లకు ఖాళీలు ఏర్పడగా, ఖాళీల భర్తీ కొరకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. దానితో 25 మంది విద్యార్థినిలు దరఖాస్తు చేసుకున్నారు. అందువలన గురువారం ఈ ప్రవేశపరీక్ష ఆ 25 విద్యార్థినీలకు నిర్వహించబడినది. ఈ పరీక్ష నిర్వహణను నిర్మల్ జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జయంతి డానియల్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.