calender_icon.png 21 February, 2026 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిష్యుం.. డిష్యుం..!

21-02-2026 12:35:26 AM

  1. ఆరోపణలు, ప్రత్యార్పణలతో కాంగ్రెస్, బిజెపి నాయకులు

బిజెపి వర్సెస్ కాంగ్రెస్ 

కామారెడ్డి నియోజకవర్గంలో రచ్చ కెక్కిన  రాజకీయాలు 

దమ్ముంటే ఆధారాలతో రండి 

నేను సరస్వతి శిశు మందిర్ వేదిక వద్ద తేల్చుకుందాం 

తప్పుడు ఆరోపణలు వద్దు నిజాలు ఉంటే రండి 

రమణారెడ్డి వర్సెస్ షబ్బీర్ అలీ

కామారెడ్డి, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు జరిగి ఫలితాలు రాగానే రాజకీయ పార్టీ ల మధ్య మాటల డిష్యుం... డిష్యూo ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికల్లో కామారెడ్డి ప్రజలు ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోవడంతో రాజకీయ వేడి రాజుకుంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల లో గెలుపొందగా రెండవ స్థానంలో బిజెపి 16 స్థానాలను కైవసం చేసుకుంది.

టిఆర్‌ఎస్ మూడో స్థానంలో 11 స్థానాలను కైవసం చేసుకోగా ఇండిపెండెంట్లు ముగ్గురు గెలుపొందారు. కామారెడ్డి మున్సిపల్ పీఠం అధిరోహించేందుకు కాంగ్రెస్ బిజెపి పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రయత్నాలు చేశాయి. టిఆర్‌ఎస్ పార్టీ కీలకంగా మారడంతో కాంగ్రెస్కు టిఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇచ్చి మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానాన్ని బిఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బిజెపి పార్టీలు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు శత విధాల ప్రయత్నాలు చేశారు.

మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన ఉమారాణి తో కలిసి పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బిజెపికి చెందిన తాటిపల్లి వెంకటరమణారెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మరుసటి రోజు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి షబ్బీర్ అలీపై ఘాటైన విమర్శలు చేశారు. దీంతో కామారెడ్డి రాజకీయం వేడెక్కింది. 

ఆరోపణలు..ప్రత్యారోపణలు..

కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తుండడంతో రాజకీయాలు వేడె క్కాయి. షబ్బీర్ అలీ అనుచరులు మరోవైపు బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనుచరులు ప్రతి మండల కేంద్రంలో పత్రిక సమావేశాలు నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

కళాశాల ఆస్తులపై చర్చిద్దాం రా..ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కళాశాల ఆస్తులు అమ్ముకున్నట్లు రుజువు చేస్తే తాను గుండు గీసుకొని రాజకీయాల నుంచి వైదొలుగు తా అని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సవాల్ విసిరిన విషయం విధితమే. ఎమ్మెల్యే సవాల్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు స్పందించి ఆధారాలతో వస్తాం చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. దీంతో శుక్రవారం ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి సాక్షా ఆధారాలతో వస్తాను మీ వద్ద సాక్షాలు ఉంటే తీసుకొని రండి,

ప్రభుత్వ డిగ్రీ కళాశాల కమిటీ, పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, కర్షక్ బిఈడి కళాశాల, ఆరోరా ఇంజనీరింగ్ కళాశాల యజమానులను తీసుకొని రండి అంటూ వేదిక కూడా సరస్వతి శిశు మందిర్ వద్దకు రండి అంటూ ఎమ్మెల్యే కా టిపల్లి రమణారెడ్డి శుక్రవారం ప్రకటించారు. దీంతో కాంగ్రెస్, బిజెపి నాయకుల మధ్య ప్రచ్చన్న యుద్ధం ప్రారంభమైంది. రెండు పార్టీల ప్రతినిధులు వేదిక వద్దకు వస్తారా లేదా వేచి చూడాల్సిందే.

కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకుల మధ్య పోరు మండల నాయకుల వద్ద మంట పెడుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్, బిజెపి నాయకులు కార్యకర్తల మధ్య రణరంగంగా మారనుంది. డిష్యుం... డిష్యుం... అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కళాశాల ఆస్తులను అరవ ర కళాశాల యజమాన్యానికి అమ్ముకున్నారంటూ షబ్బీర్ అని చేసిన విమర్శలు కు స్పందించిన ఎమ్మెల్యే ఆధారాలు ఉంటే తీసుకుని రండి అంటూ సవాల్ విసిరారు. దీంతో ప్రతి సవాల్ గా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పందించి వేదిక వద్దకు రండి ఆధారాలు చూపండి అంటూ సవాల్ విసిరారు.

దీంతో కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్, బిజెపిల పార్టీల మధ్య రణరంగం ల మారింది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున పోలీసులకు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఎమ్మెల్యే సవాలకు కాంగ్రెస్ నాయకులు ఆధారాలతో వస్తారా లేక ప్రతి ఆరోపణలతోనే సరిపెడతారా వేచి చూడాల్సిందే మరి .