30 August, 2026 | 10:10 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

టాటా ప్లేలో డిస్నీ వాటా విక్రయం

23-05-2024 12:05 AM

విలువ 1 బిలియన్ డాలర్లు

ముంబై, మే 22: టెలివిజన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ టాటా ప్లేలో వాల్ట్ డిస్నీకి ఉన్న మైనారిటీ వాటాను విక్రయించాలని నిర్ణయిం చింది. టాటా ప్లేలో డిస్నీకి 29.8 శాతం వాటా ఉన్నది. దీనిని టాటా గ్రూప్‌కే 1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.8,300 కోట్లు) విక్రయించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాటాను కొనుగోలు చేసిన తర్వాత ఈ టీవీ ప్లాట్‌ఫాంను పూర్తి ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలని టాటా గ్రూప్ భావిస్తున్నది. వాల్డ్ డిస్నీ తన ఇండియా యూని ట్‌ను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని వయోకామ్ 18 మీడియాకు విక్రయించడానికి ఒ ప్పందంపై సంతకాలు చేసింది. సెట్‌టాప్ బాక్సుల ద్వారా పే టెలివిజన్ ఛానళ్లను, యా ప్ ద్వారా వీడియో స్ట్రీమింగ్‌ను అందించే టాటా ప్లేకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.