30 August, 2026 | 11:22 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

హిందుస్థాన్ జింక్ నెలరోజుల్లో డబుల్

23-05-2024 12:05 AM

వెండి ఎఫెక్ట్

ముంబై, మే 22: వేదాంత గ్రూప్ యాజమాన్యంలో ఉన్న హిందుస్థాన్ జింక్ షేర్లు నెలరోజుల్లో రెట్టింపయ్యాయి. దేశంలో వెండిని ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీ అయిన హింద్ జింక్ బుధవారం బీఎస్‌ఈలో 8.75 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి రూ. 807 వద్దకు చేరింది. ఆరు రోజులపాటు నాన్ ర్యాలీ జరపడంతో ఈ షేరు మార్కెట్ విలువ సైతం రూ.3 లక్షల కోట్ల స్థాయిని అధిగమించింది. హిందుస్థాన్ జింక్ ఆదాయంలో చాలావరకూ జింక్ ఉత్పత్తి ద్వారా లభిస్తున్నప్పటికీ, దేశంలో వెండిని ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీయే కాదు.. 2023 రికార్డుస్థాయిలో వెండిని ఉత్పత్తి చేసి ప్రపంచంలో వెండి ఉత్పత్తి చేసే కంపెనీల్లో  మూడో స్థానానికి ఎగబాకింది. 2024 హిందుస్థాన్ జింక్ వెండి అమ్మకాలు 27 శాతం వృద్ధితో రూ. 6,840 కోట్లకు చేరతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

775 టన్నుల వెండి ఉత్పత్తి

2022 హింద్ జింక్ మొత్తం అమ్మకాల ఆదాయంలో వెండి నుంచి 19 శాతం ఒనగూడింది. జింక్ వాటా 60 శాతంగా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 750 టన్నుల వెండిని ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ గైడెన్స్‌లో వెల్లడించింది. దేశంలో కేజీ వెండి ధర రూ.లక్ష మార్క్‌ను దాటి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు జింక్ ధరలు సైతం ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్నాయి. హిందుస్థాన్ జింక్‌లో వేదాంత గ్రూప్‌నకు 64.92 శాతం వాటా ఉన్నది. 29.5 శాతం వాటా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన డిజిన్వెస్ట్‌మెంట్‌లో హింద్ జింక్‌ను వేదాంత గ్రూప్ కొనుగోలు చేసింది.