30 August, 2026 | 8:59 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

4 నెలల్లో 24 టన్నుల బంగారం కొన్న ఆర్బీఐ

23-05-2024 12:05 AM

ముంబై, ఏప్రిల్ మే 22: కేవలం నాలుగు నెలల వ్యవధిలో రిజర్వ్‌బ్యాంక్ 24 టన్నుల బంగారాన్ని కొన్నది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ మార్కెట్ల ఒడిదుడుకుల నుంచి ఫారెక్స్ నిల్వల్ని సంరక్షించుకునేందుకు ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ ఇంత పెద్ద మొత్తంలో బంగారం నిల్వల్ని ఆర్బీఐ జతచేసుకున్నది. 2023 మొత్తం సంవత్సరంలో కొనుగోలు చేసిన 16 టన్నులకంటే ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 150 శాతం ఎక్కువ కొన్నది. 2023 డిసెంబర్ చివరినాటికి రిజర్వ్‌బ్యాంక్ వద్దనున్న విదేశీ మారక నిల్వల్లో బంగారం నిల్వలు 805 టన్నులు ఉండగా, 2024 ఏప్రిల్ 26నాటికి ఇవి 827.69 టన్నులకు చేరాయి. దీంతో విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 7.75 శాతం నుంచి 8.7 శాతానికి చేరింది.