30 March, 2026 | 6:58 AM

‘నర్సాపూర్’ ఓటుకు దూరం

16-05-2024 01:59 AM

ఓటు హక్కు వినియోగించుకోని 5,309 మంది 

నర్సాపూర్, మే 15 : నర్సాపూర్ మున్సిపాలిటీలో 33% మంది ఓటర్లు పార్లమెం టులో ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదు. మున్సిపాలిటీ పరిధిలో 16,149 ఓటర్లకు గానూ 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 10840 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5309 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదు.

ప్రభుత్వం ప్రతి ఓటరు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా దూరంగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోనే చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 90% ఓటు హక్కును వినుయోగించుకుంటున్నారు.