21 July, 2026 | 12:35 PM

వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ

21-07-2026 01:28 AM

నేరేడుచర్ల, జూలై 20 :నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శ్రీ విజయదుర్గ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వారాహి అ మ్మవారి ఆలయంలో వారాహి మాత మాలధారణ స్వాములకు హుజూర్నగర్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా సరికొప్పుల నాగేశ్వర రావు ,14 వ వార్డు కౌన్సిలర్ సరికొప్పుల విజయలక్ష్మిలు స్వయంగా స్వాములకు అన్న ప్రసాదాన్ని వడ్డించి వారి ఆశీస్సులు పొం దారు. వారాహి అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వారాహి మాత మాలధారణ స్వాములు, భక్తులు, జనసేన పార్టీ కౌన్సిలర్,కొమ్మరాజు శ్రీను, అంజి, మహేష్, భాస్కర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.